అమెరికాలో పరిస్థితులు బాగోలేవు భారత్‌కు తిరిగి రండి: శ్రీధర్ వెంబు
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:50 AM
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని జొహొ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కోరారు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అమెరికాలో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని జొహొ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కోరారు. ఆయన ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాసి, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వలసలు, ఉద్యోగాలకు సంబంధించి మారుతున్న దృక్పథాన్ని వివరించారు. ‘భారత సోదర, సోదరీమణులారా.. 37 సంవత్సరాల క్రితం జేబులో డబ్బు లేకుండా నేను అమెరికాకు వచ్చినట్టే, మీరూ వచ్చారు. ఉన్నత చదువు, భారతీయ సంస్కారంతో అద్భుత విజయాలు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది అమెరికన్లు వారి ఉద్యోగాలను భారతీయులు లాక్కొంటున్నారని, మనం సాధించిన విజయం అన్యాయమని అంటున్నారు. ఈ సంఘర్షణలో మీరు ప్రేక్షకులు మాత్రమే. గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే.. ప్రపంచంలో భారతీయులకు గౌరవం దక్కాలంటే మన దేశం బలంగా నిలబడాలి. భారత్‌కు మీ నైపుణ్యం అవసరం. స్వదేశానికి తిరిగి రండి. మన యువతకు మీ సాంకేతిక నాయకత్వం అవసరం’ అని శ్రీధర్ వెంబు కోరారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం