ఇన్‌ఫ్లుయెన్సర్ భరద్వాజ్‌కు రెగ్యులర్ బెయిల్
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:39 AM
జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన కేసులో సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు పటియాలా హౌస్ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి మంగళవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 6: జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన కేసులో సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు పటియాలా హౌస్ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి మంగళవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. గత నెల 15న మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ సందర్భంగా విధించిన షరతులను కచ్చితంగా పాటించడంతో ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. కోర్టు ఎంతో నమ్మకంతో బెయిల్ ఇచ్చిందని, దీన్ని విజయంగా భావించి విడుదలైన తరువాత ఉత్సవం జరుపుకోకూడదని హెచ్చరించారు. జూన్ 23న జరిగిన ఆందోళనలో ఓ విద్యార్థి తండ్రి తల పగులగొట్టినట్టు అనంతరం అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిపై విమర్శలు రావడంతో గత నెల నాలుగో తేదీన బులంద్‌షహర్‌లో పోలీసులు అతడ్ని అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపించారు. గతంలో మూడు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి బెయిల్ వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన