Share News

ఇండీ కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:50 AM

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని అక్టోబరు 30న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో నిర్వహించనుంది.

ఇండీ కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు
cjp

న్యూఢిల్లీ, అక్టోబరు 28: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని అక్టోబరు 30న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో నిర్వహించనుంది. తొలుత ఈ కార్యక్రమాన్ని అశోకా హోటల్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ అనుమతి లభించలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. అనంతరం రామ్‌లీలా మైదానంలో నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా అనుమతులు నిరాకరించారని పేర్కొంది. దీంతో ఖర్గే నివాసాన్ని కార్యక్రమ వేదికగా నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ నవంబరు 1న నిర్వహించనున్న ఇండీ కూటమి సభకు సీజేపీ మద్దతు ప్రకటించింది.

Updated Date - Oct 29 , 2026 | 07:09 AM