Share News

ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్..షిండే గూటికి ఆరుగురు శివసేన ఎంపీలు

ABN , Publish Date - Jun 22 , 2026 | 07:10 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు.

ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్..షిండే గూటికి ఆరుగురు శివసేన ఎంపీలు
Eknath Shinde

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. ఓంరాజే నింబాల్కర్, సంజయ్ పాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశముఖ్, నాగేశ్ పాటిల్ ఆష్టికార్, భావుసాహేబ్ వాక్చౌరే ఏక్‌నాథ్‌తో జట్టుకట్టారు. ఇటీవలే, బెంగాల్‌లోని 20 మంది టీఎంసీ ఎంపీలు పార్టీని వీడి నేషనలిస్టు సిటిజన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఉద్ధవ్ సేన రెబల్ వర్గం ఎంపీలు తమ పార్టీలో చేరడంపై ఏక్‌నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ‘అసలైన పులులు ఇక్కడకు వచ్చేశాయి. అసలైన శివ సేన కుటుంబంలో వారు భాగమయ్యారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను’ అని అన్నారు. ఆపరేషన్ టైగర్ ముగిసిందని వ్యాఖ్యానించారు. రెబల్ ఎంపీలు దురంధర్‌లు అంటూ ఇటీవలి బాలివుడ్ హిట్ సినిమా ప్రస్తావన కూడా తెచ్చారు. షిండే 2022లో తొలిసారిగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో శివసేన రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే.


ఈ సందర్భంగా ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు కూడా డిప్యూటీ సీఎం చురకలంటించారు. తమ వద్దే ముగ్గరు సంజయ్‌లు ఉన్నారని, ఇక మరే సంజయ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఆరుగురు ఎంపీల నియోజకవర్గాల్లో నిధులకు, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Updated Date - Jun 22 , 2026 | 07:22 PM