సిగ్నల్ ట్యాంపర్ చేసి రైలులోకి..
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:23 AM
తీర్థయాత్రల నిమిత్తం కాశీకి వెళ్లి తిరిగొస్తున్న గుంటూరు జిల్లా తెనాలి వాసులు రైలులో నిలువు దోపిడీకి గురయ్యారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలులోకి చొరబడిన దోపిడీ గ్యాంగ్..
కాశీ నుంచి వస్తున్న భక్తుల నిలువు దోపిడీ
మధ్యప్రదేశ్‌లో ఘటన.. తెనాలిలో ఫిర్యాదు
తెనాలి క్రైం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తీర్థయాత్రల నిమిత్తం కాశీకి వెళ్లి తిరిగొస్తున్న గుంటూరు జిల్లా తెనాలి వాసులు రైలులో నిలువు దోపిడీకి గురయ్యారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలులోకి చొరబడిన దోపిడీ గ్యాంగ్.. వారివద్ద నుంచి నగదు, బంగారు నగలు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. మంగళవారం బాధితులు తెనాలి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు... తెనాలి నుంచి 21 మంది భక్తులు ఈ నెల 19న కాశీకి వెళ్లారు. 27వ తేదీ సాయంత్రం కాశీ, తమిళ్ సంగం ఎక్స్‌ప్రె్‌సలో అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో రైలు మధ్యప్రదేశ్‌లోని కట్ని జంక్షన్ సమీపంలోకి రాగానే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసిన సుమారు 15-20 మంది దుండగులు ముసుగులు ధరించి, మారణాయుధాలతో లోపలికి ప్రవేశించి దోచుకున్నారు. ఈ క్రమంలో తెనాలికి చెందిన ఒకే కుటుంబ సభ్యుల నుంచి 18 గ్రాముల బంగారు వస్తువులు, 10 వేల నగదు అపహరించారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం