Share News

వాళ్లు నన్ను చంపేస్తారేమో.. అయినా డిసెంబరులో వెళ్లిపోతా!

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:06 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానీ షేక్‌ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టుకు లొంగిపోతానని ప్రకటించారు. తనతో పాటు అవామీ లీగ్‌కు...

వాళ్లు నన్ను చంపేస్తారేమో.. అయినా డిసెంబరులో వెళ్లిపోతా!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా

న్యూఢిల్లీ, జూలై 10: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానీ షేక్‌ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టుకు లొంగిపోతానని ప్రకటించారు. తనతో పాటు అవామీ లీగ్‌కు చెందిన పలువురు సీనియర్‌ నేతలు కూడా తిరిగి వస్తారని ఆమె తెలిపారు. తనను అరెస్టు చేయవచ్చని, చంపే ప్రమాదం కూడా ఉందని, అయినా తగ్గబోనని అన్నారు. ఒకవేళ తాను చనిపోవాల్సి వచ్చినా తన తల్లిదండ్రుల ఖననం జరిగిన నేలపైనే చనిపోవాలని కోరుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2024లో జరిగిన విద్యార్థుల ఆందోళనల అణిచివేత కేసులో బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించింది.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 06:12 AM