Share News

కాంగ్రెస్‌లో ఆత్మపరిశీలన కావాలి

ABN , Publish Date - May 06 , 2026 | 06:31 AM

తాజా ఎన్నికల ఫలితాల్లో కేరళం మినహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రదర్శనపై ఆ పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత...

కాంగ్రెస్‌లో ఆత్మపరిశీలన కావాలి

కేరళం వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి: శశిథరూర్‌

తిరువనంతపురం, మే 5: తాజా ఎన్నికల ఫలితాల్లో కేరళం మినహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రదర్శనపై ఆ పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో పార్టీలో లోతైన ఆత్మపరిశీలన జరగాలని పేర్కొన్నారు. పార్టీ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని, ప్రచార వ్యూహాలు, సంస్థాగతంగా బలోపేతం కావడం, ఓటర్లను ఆకట్టుకోవడం వంటి అంశాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. కేరళంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించడం వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేయాలని, జాతీయ స్థాయిలో పార్టీ పరిస్థితి మెరుగుపడటానికి ఇలాంటి వ్యూహాలనే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించారు. మోదీ, అమిత్‌ షా అనుసరించిన ఎన్నికల వ్యూహాలను ఆయన ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:31 AM