సెజ్‌ల్లోని పరిశ్రమలకు కస్టమ్స్ సుంకంపై రాయితీ
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:23 AM
దేశంలోని సెజ్‌ల్లోని పరిశ్రమలకు కేంద్రం కీలక ఉపశమనం కల్పించింది. ఆయా పరిశ్రమలు దేశీయంగా విక్రయించే ఉత్పత్తులపై విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీని తాత్కాలికంగా...
ఏడాది పాటు తాత్కాలిక ఉపశమనం కల్పించిన కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలోని సెజ్‌ల్లోని పరిశ్రమలకు కేంద్రం కీలక ఉపశమనం కల్పించింది. ఆయా పరిశ్రమలు దేశీయంగా విక్రయించే ఉత్పత్తులపై విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీని తాత్కాలికంగా తగ్గించింది. అమెరికా సుంకాలు, పశ్చిమాసియాలో యుద్ధం మూలంగా ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొనడంతో సెజ్‌ల్లోని పరిశ్రమలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కస్టమ్స్ సుంకంపై కేంద్రం రాయితీలు ప్రకటించింది. సెజ్‌ల్లోని పరిశ్రమలన్నీ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడి ఉంటాయి. ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తే నిబంధనల భారీగా కస్టమ్స్ సుంకం చెల్లించాలి. అయితే దేశీయ విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్టమ్స్ సుంకంపై తాత్కాలిక ఉపశమనం ప్రకటించింది. ప్రస్తుతం 20శాతం కస్టమ్స్ సుంకం విభాగంలో ఉన్న ఉత్పత్తులపై సుంకాన్ని 12.5శాతానికి, 20-30 శాతం విభాగంలోని వాటిపై కస్టమ్స్ సుంకాన్ని 15శాతానికి, 30-40 శాతం విభాగంలోని వాటిపై 20శాతానికి తగ్గించింది. 2026 ఏప్రిల్1 నుంచి 2027 మార్చి 31 దాకా ఇది అమలులో ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల ప్లాస్టిక్, టెక్స్‌టైల్, కెమికల్స్, ఎలకా్ట్రనిక్స్ తదితర రంగాలకు ఉపశమనం లభించనుంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆయా పరిశ్రమలు చేసిన ఎగుమతుల్లో 30శాతానికి మించి దేశీయ విక్రయాలు ఉండరాదనే షరతును విధించింది.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News