Share News

బీజేపీలో చద్దా అండ్‌ కో విలీనం

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:11 AM

రాఘవ్‌ చద్దా ఆధ్వర్యంలోని ఏడుగురు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారు. ఈ నెల 24న ఆప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన చద్దా, ఆప్‌ రాజ్యసభాపక్ష ఉపనేత...

బీజేపీలో చద్దా అండ్‌ కో విలీనం

ఆమోదించిన రాజ్యసభ సచివాలయం

ఏడుగురు ఆప్‌ ఎంపీల చేరికతో

రాజ్యసభలో 113కి పెరిగిన బీజేపీ బలం

148కి చేరిన ఎన్‌డీఏ ఎంపీల సంఖ్య

బీజేపీలో చద్దా అండ్‌ కో విలీనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: రాఘవ్‌ చద్దా ఆధ్వర్యంలోని ఏడుగురు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారు. ఈ నెల 24న ఆప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన చద్దా, ఆప్‌ రాజ్యసభాపక్ష ఉపనేత అశోక్‌కుమార్‌ మిత్తల్‌, సందీప్‌ పాఠక్‌తో పాటు మరో నలుగురు సహచర ఎంపీలు హర్భజన్‌సింగ్‌, రాజీందర్‌ గుప్తా, విక్రమ్‌జిత్‌సింగ్‌ సాహ్నీ, స్వాతి మలివాల్‌.. బీజేపీలో చేరతామంటూ సంయుక్తంగా చేసిన అభ్యర్థనను రాజ్యసభ సచివాలయం తాజాగా ఆమోదించింది. దీంతో వారు ఇప్పుడు అధికార పార్టీ ఎంపీలుగా మారారు. వీరి చేరికతో 245 సభ్యుల ఎగువ సభలో బీజేపీ బలం 113కి పెరిగింది. అలాగే ఎన్‌డీఏ మ్యాజిక్‌ మార్క్‌ ‘123’ దాటేసింది. దాని సంఖ్యాబలం 148కి చేరుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీకి 163 సీట్లు కావాలి. ఈ ఏడాది 30 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో మరో 5 బీజేపీ ఖాతాలో పడనున్నాయి. ఇంకోవైపు.. బీజేపీలో చేరిన పై ఏడుగురి రాజ్యసభ సభ్యత్వం రద్దుచేయాలని ఆప్‌ ఆదివారం చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌కు పిటిషన్‌ సమర్పించింది. కాగా, ఆప్‌లో విషపూరిత వాతావరణం నెలకొందని, పనిచేయకుండా నాయకులను అడ్డుకుంటున్నారని అందుకే ఆ పార్టీని వీడానని రాఘవ్‌ చద్దా తెలిపారు. తాను ఆప్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణాలను ఆయన సోమవారం సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 07:11 AM