Share News

ఎస్సీ స్థానాల అభ్యర్థుల సర్టిఫికెట్లను

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:19 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే కుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేలా...

ఎస్సీ స్థానాల అభ్యర్థుల సర్టిఫికెట్లను

క్షుణ్ణంగా తనిఖీ చేయించాలంటూ పిల్‌

చెన్నై, ఏప్రిల్‌ 7: అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే కుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందు, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన ఎస్సీలే ఈ సీట్లలో పోటీకి అర్హులని, మతం మారిన వారు రంగంలో ఉండకుండా నిరోధించేందుకు సర్టిఫికెట్ల పరిశీలన జరగాలని పిటిషనర్‌ కోరారు. ఈ మేరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరించే రిటర్నింగ్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఇందు మక్కల్‌ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునన్‌ సంపత్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమిళనాడులో 44 స్థానాలను ఎస్సీలకు కేటాయించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:19 AM