సీజేపీ నేత సౌరవ్‌దాస్ భారతీయుడేనా?
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:16 AM
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సహ సమన్వయకర్త సౌరవ్‌దాస్ భారతీయుడో కాదో ఆరు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి..
కేంద్రాన్ని కౌంటర్ దాఖలు చేయాలన్న మద్రాసు హైకోర్టు
చెన్నై, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సహ సమన్వయకర్త సౌరవ్‌దాస్ భారతీయుడో కాదో ఆరు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది. సౌరవ్‌దాస్ భారతీయుడా కాదా అనే విషయంపై విచారణ జరిపేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలివ్వాలని కోరుతూ చెన్నైలోని జమీన్‌పల్లావరం ప్రాంతానికి చెందిన గణేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ జరిపే విచారణ సౌరవ్‌దాస్ నేపాలీ అని తేలితే అతడికి జారీ చేసిన భారతీయ పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డును రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్ట్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టీస్ అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది.