హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
ABN , Publish Date - Jun 28 , 2026 | 09:46 PM
హైవేపై రివర్స్‌లో వెళుతున్న కారును వెనక వైపు నుంచి మరో ఎస్‌యూవీ ఢీకొట్టడంతో కారులోని నలుగురు దుర్మరణం చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో సహారన్‌పూర్‌కు సమీపంలోని హైవేపై తాజాగా ఘోర ప్రమాదం సంభవించింది. హైవేపై రివర్స్‌లో వెళుతున్న కారును వెనక వైపు నుంచి మరో ఎస్‌యూవీ ఢీకొట్టడంతో కారులోని నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. డెహ్రాడున్-పంచ్‌కులా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట కలకలం రేపుతోంది.
హైవేపై టియాగో కారు రివర్స్‌లో వెళుతుండగా బొలెరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో, కారు మొదట రోడ్డుకు ఒకవైపున ఉన్న డీవైడర్‌ను ఢీకొట్టి ఆ తరువాత రోడ్డు మధ్యలోని మరో డివైడర్‌ను ఢీకొట్టింది. మరోవైపు ఎస్‌యూవీ కూడా బోల్తాపడింది. కారులోని చరణ సింగ్, ఆయన భార్య, కోడలు ప్రీతి, మనవడు శివాంశ్ దుర్మరణం చెందారు. మరో మ్గుగరు తీవ్రంగా గాయపడ్డారు.
హర్యానాలోని సోనీపత్ జిల్లా బహదూర్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం హరిద్వార్‌కు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. రెండు కార్లను సీజ్ చేశారు. అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్
రామమందిర నిధుల దుర్వినియోగం.. సంపన్నులుగా మారిన నిందితులు!