శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్రసాదం కొరత
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:25 AM
కేరళం శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్రసాదం కొరత ఏర్పడింది. దీంతో ప్రతి భక్తుడికి ఒక అరవణ పాయసంతోపాటు మూడు అప్పం ప్యాకెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. భక్తులకు సరిపడా ప్రసాదం లేకపోవడంపై కేరళం దేవాదాయ శాఖ మంత్రి మురళీధరన్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు
ట్రావెన్‌కోర్ బోర్డుపై మంత్రి మురళీధరన్ అసహనం
తిరువనంతపురం, సెప్టెంబరు 21: కేరళం శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్రసాదం కొరత ఏర్పడింది. దీంతో ప్రతి భక్తుడికి ఒక అరవణ పాయసంతోపాటు మూడు అప్పం ప్యాకెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. భక్తులకు సరిపడా ప్రసాదం లేకపోవడంపై కేరళం దేవాదాయ శాఖ మంత్రి మురళీధరన్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తానని మంత్రి హెచ్చరించారు. కాగా, కన్ని నెల(సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు)లో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 2.6లక్షల టిన్నుల అరవణ ప్రసాదాన్ని ముందే సిద్ధం చేసి ఉంచామని ట్రావెన్‌కోర్ బోర్డు తెలిపింది. గత ఏడాది కన్నా 50 వేల టిన్నులు అధికంగా తయారు చేశామని, అయితే సీజన్ ప్రారంభం కావడానికి ముందే భక్తులు పోటెత్తడంతో కొరత ఏర్పడిందని వివరించింది. ప్రస్తుతం 14వేల టిన్నుల ప్రసాదం మాత్రమే మిగిలిందని తెలిపింది. ప్రసాదం కేంద్రాన్ని ఆధునికీకరిస్తుండటం వల్లే కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు
బోన్ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి