Share News

బెంగాల్‌పై కన్నేస్తే.. పాక్‌ పటాపంచలే!

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:51 AM

కోల్‌కతాపై దాడి చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రస్థాయిలో...

బెంగాల్‌పై కన్నేస్తే.. పాక్‌ పటాపంచలే!

  • పాక్‌ రక్షణమంత్రి వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: కోల్‌కతాపై దాడి చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలంటూ ఘాటుగా స్పందించారు. ‘‘పాక్‌ రక్షణమంత్రి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. 55ఏళ్ల క్రితం(1971లో) పాకిస్థాన్‌ రెండు ముక్కలైనప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కున్నారో వారు గుర్తుంచుకోవాలి’’ అని హెచ్చరించారు. పాక్‌ వ్యాఖ్యల నేపథ్యంలో అటు కేంద్రంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. పాక్‌ రక్షణమంత్రి కోల్‌కతాను బహిరంగంగా బెదిరిస్తున్నా మోదీ, అమిత్‌ షా కనీసం ఖండించే ధైర్యం కూడా చేయడం లేదని ఆ పార్టీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:52 AM