Share News

Railway Ministry Ashwini Vaishnaw: ఉత్తరాంధ్రకు రైల్వేశాఖ శుభవార్త

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:58 AM

ఉత్తరాంధ్రకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మూడు రైల్వేస్టేషన్లలో...

Railway Ministry Ashwini Vaishnaw: ఉత్తరాంధ్రకు రైల్వేశాఖ శుభవార్త

  • మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌

న్యూఢిల్లీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మూడు రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌(ఆగడం) కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మక ప్రాతిపదికన బ్రహ్మపూర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రె్‌సకు తిలారు వద్ద, పూరి-అహ్మదాబాద్‌ ఎక్స్‌ప్రె్‌సకు ఇచ్ఛాపురం వద్ద, భువనేశ్వర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రె్‌సకు బారువా వద్ధ ఆపనున్నారు. వీలైనంత త్వరలో ఈ స్టేషన్లలో ఆయా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పిస్తామని రైల్వే శాఖ తెలిపింది.

Updated Date - Jan 03 , 2026 | 05:00 AM