టాటా గ్రూపును ధ్వంసం చేస్తున్నారు
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:11 AM
నోయల్ టాటా సవాల్ చేయడంతో వివాదం మొదలైంది. కొత్త నియామకానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబరు 17న జరిగిన సమావేశంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన ఆరోపించారు.
ఏ వ్యాపారవేత్తా మాట్లాడరేం?
వ్యాపార రంగాన్ని ఆటవస్తువులా పరిగణిస్తున్న మోదీ, అమిత్‌షా
విపక్ష నేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోండి
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ నిర్మల
భారత పరిశ్రమలపై నిరాధార ఆరోపణలు చేయడం ఆపాలని హితవు
నోయల్ టాటా సవాల్ చేయడంతో వివాదం మొదలైంది. కొత్త నియామకానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబరు 17న జరిగిన సమావేశంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఈ నెల 26న టాటా సన్స్ కార్యదర్శి సుప్రకాశ్ ముఖోపాధ్యాయకు నోయల్ లేఖ రాశారు. ఈ సమావేశంలో డైరెక్టర్లకు అందించిన ఎజెండాలో చంద్రశేఖరన్ పునఃనియామకానికి సంబంధించిన అంశమే లేదని అందులో తెలిపారు. డైరెక్టర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సమావేశంలో చంద్రశేఖరన్ నియామకంపై పెట్టిన తీర్మానాన్ని తుది నిర్ణయంగా పరిగణించాలన్న కంపెనీ నిర్ణయం సరికాదన్నారు. అందువల్ల ఆ తీర్మానం చెల్లదని ఆయన స్పష్టం చేశారు. టాటా సన్స్‌కు చెందిన ‘ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్’కు చెందిన ఏ నిబంధననూ ఈ ప్రక్రియలో అనుసరించలేదని విమర్శించారు. తీర్మానానికి సంబంధించిన ధ్రువీకరించిన కాపీని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడాన్ని, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేయడాన్నీ నోయల్ తప్పుబట్టారు. కంపెనీ రికార్డుల విషయం తేలేవరకు ఈ వ్యవహారంలో అదనపు చర్యలు తీసుకోవద్దని కంపెనీని నోయల్ కోరారు.

ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోండి: నిర్మల
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, భారతీయ పరిశ్రమలపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. భారతీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల విజయాలను పదేపదే కించపరుస్తున్న రాహుల్‌గాంధీ.. ఇప్పుడు దేశంలో అభద్రతా భావాన్ని, విషపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడానికి వ్యాపార దిగ్గజాలను
ఉసిగొల్పుతున్నారా? అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి