Share News

ఎదురుదాడి కాదు.. ఫీజు బకాయిలు చెల్లించండి

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:50 AM

ఏపీ నుంచి రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్న తనను ఆ రాష్ట్రంలోనే ఉద్యమాలు చేయాలని.. తెలంగాణలో చేయొద్దంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించడం సరికాదని ఎంపీ...

ఎదురుదాడి కాదు.. ఫీజు బకాయిలు చెల్లించండి

  • సీఎం రేవంత్‌కు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్న తనను ఆ రాష్ట్రంలోనే ఉద్యమాలు చేయాలని.. తెలంగాణలో చేయొద్దంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించడం సరికాదని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణలో 14 లక్షల మంది విద్యార్థులు ఫీజులు, స్కాలర్‌షి్‌పలు రాక ఇబ్బంది పడుతుంటే.. వారి పక్షాన ప్రశ్నిస్తున్న తనపై సీఎం ఎదురుదాడి చేయడం శోచనీయమన్నారు. తనకు పోరాడడం కొత్త కాదని ఇప్పటివరకు 16 వేల ఉద్యమాలు చేశానని చెప్పారు. రూ.8 వేల కోట్ల ఫీజు బకాయులు చెల్లించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీంను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించకపోతే 31న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తారని... కలెక్టరేట్‌, డీఈవో, ఎంఈవో కార్యాలయాలను ముట్టడిస్తామని ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:50 AM