Share News

లోయలో తోసి.. పాము అని నమ్మించి!

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:38 AM

మహారాష్ట్రలోని పుణెలో యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ మృతి కేసులో సియాగోయల్‌ క్రూరత్వం ఒక్కొక్కటిగా బటయపడుతోంది...

లోయలో తోసి.. పాము అని నమ్మించి!

పుణె, జూన్‌ 24: మహారాష్ట్రలోని పుణెలో యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ మృతి కేసులో సియాగోయల్‌ క్రూరత్వం ఒక్కొక్కటిగా బటయపడుతోంది. జూన్‌ 18న లోహగఢ్‌ కోటపై నుంచి నెట్టేసి హత్య చేయడానికి నాలుగు రోజుల ముందే.. అంటే జూన్‌ 14న కూడా ఆమె కేతన్‌ను లోయలోకి తోసేసిందని పోలీసులు గుర్తించారు. ఆ రోజు కేతన్‌ అదృష్టవశాత్తు ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బతికిపోయాడు. అక్కడ ఒక పాము కనిపించిందని, అది కాటు వేయకుండా కాపాడేందుకే కంగారులో తోసేశానని సియా అప్పుడు నమ్మబలికింది. ఆరోజు ప్రాణాలతో బయటపడినా జూన్‌ 18న అదే ప్రాంతంలో సియా తన ప్రియుడితో కలిసి కేతన్‌ను చంపేసిందని మృతుడి తండ్రి విశాల్‌ కంటతడిపెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 07:37 AM