Share News

పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్‌ హతం..!

ABN , Publish Date - May 21 , 2026 | 03:38 PM

పుల్వామా ఉగ్రదాడి నిందితుడిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నేడు అతనిపై కొంత మంది కాల్పులు జరిపినట్లు సమాచారం.

పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్‌ హతం..!

జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడి నిందితుడిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో ఈ రోజు (గురువారం) అతనిపై కొంత మంది కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో హమ్జా బుర్హాన్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. దీనిపై పాకిస్థాన్ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు.


పుల్వామా దాడికి సంబంధించి హమ్జా బుర్హాన్‌ను కీలక సూత్రధారుల్లో ఒకరిగా భారత అధికారులు భావిస్తున్నారు. కాగా, 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్‌కు చెందిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు పలు దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.

Updated Date - May 21 , 2026 | 03:38 PM