అత్యంత ప్రజాదరణ గల నేతగా ప్రధాని మోదీ!
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:41 AM
పలు దేశాల్లో నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత ప్రజాదరణ గల నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఆయనకు ఈ సర్వేలో...
అమెరికన్ సంస్థ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: పలు దేశాల్లో నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత ప్రజాదరణ గల నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఆయనకు ఈ సర్వేలో 70 శాతం మంది మద్దతు లభించింది. తదుపరి స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ నిలిచారు. ఆయనకు 63 శాతం మంది మద్దతు లభించింది. జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్ అత్యంత తక్కువ ప్రజాదరణ గల నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే అభిప్రాయ పరిశోధన సంస్థ వారం రోజులపాటు 24 ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేని ప్రకటించింది. ట్రంప్ అతి తక్కువ ప్రజాదరణ గల నేతల్లో పదో స్థానంలో నిలవడం విశేషం. ఆయన పనితీరుపై సర్వేలో పాల్గొన్న 38 శాతం మంది అమెరికన్లే సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..