అత్తామామల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న నర్స్..
ABN , Publish Date - Apr 04 , 2026 | 09:34 AM
కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ నర్స్ ఆత్మహత్య చేసుకుంది. 4 నెలల గర్భంతో ఉన్న ఆమె తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.
బెంగళూరు, ఏప్రిల్ 4: అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ నర్స్ ఆత్మహత్య చేసుకుంది. 4 నెలల గర్భంతో ఉన్న ఆమె తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ జిల్లా, సోరబ్ తాలూకా, హొడబట్టే గ్రామానికి చెందిన శ్వేతకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో గత సంవత్సరం పెళ్లయింది. శ్వేత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేసేది.
కొన్ని నెలల క్రితం శ్వేతకు అత్తింటి వారితో ఓ స్థలం విషయంలో గొడవైంది. ఈ గొడవ కారణంగా అత్తింటి వారు ఆమెపై కక్ష గట్టారు. అందరూ కలిసి ఆమెను వేధించటం మొదలెట్టారు. శ్వేత గర్భందాల్చినా వారి వేధింపులు మాత్రం ఆగలేదు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లినా అత్తింటి వారు ఫోన్ ద్వారా ఆమెపై వేధింపులకు పాల్పడేవారు. 4 నెలల గర్భంతో ఉన్న శ్వేత వారి వేధింపులు భరించలేకపోయింది. మార్చి 29వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తల్లిదండ్రులు ఉడిపిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ శుక్రవారం శ్వేత కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. సూసైడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్తామామ, వారి కొడుకు హేమంత్, కోడలు దివ్య కలిసి తమ కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు శ్వేత కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ మ్యాచ్ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ రెండు ఫొటోల మధ్యలో మూడు తేడాలను 23 సెకెన్లలో కనిపెట్టండి