ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్
ABN , Publish Date - Mar 02 , 2026 | 09:07 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై నెతన్యాహుతో చర్చించారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ కోరారు.
న్యూఢిల్లీ, మార్చి 2: అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిణామాలపై నెతన్యాహుతో చర్చించారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ కోరారు. ఫోన్ సంభాషణల తాలూకా విషయాలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సోమవారం ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడాను. తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాను. యుద్ధాన్ని త్వరితగతిన నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోంది’ అని రాసుకొచ్చారు.
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమావేశం
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాలు సమావేశం నిర్వహించాయి. యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఇరాన్ దాడులను చూస్తూ ఊరుకోం. మమ్మల్ని మేం రక్షించుకుంటాం. దేశాలు ఇరాన్‌పై తిరిగి దాడి చేసే హక్కు మాకు ఉంది. మా పౌరుల రక్షణకు చర్యలు తీసుకుంటాం’ అని గల్ఫ్ దేశాలు తేల్చి చెప్పాయి.
ఇవి కూడా చదవండి
మీ కళ్లకు, మెదడుకు టెస్ట్.. ఈ వృద్ధుడి మొహంలో ఉన్న ముగ్గురు అమ్మాయిలను కనుక్కోండి..
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా?