Share News

స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వండి: మోదీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:27 AM

దీపావళి పండుగను పురస్కరించుకొని స్థానిక కళాకారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు

స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వండి: మోదీ
modi

న్యూఢిల్లీ, అక్టోబరు 25: దీపావళి పండుగను పురస్కరించుకొని స్థానిక కళాకారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడంతో పాటు ఎంతోమంది పేద కళాకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. ఈ చర్య ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ ప్రచారానికి ఊపునిస్తుందని తెలిపారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 139వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ స్ఫూర్తి భారతీయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకువెళ్తోందని చెప్పారు. బిహార్‌ నుంచి మఖానా గ్రీస్‌కు చేరుతుండగా, కర్ణాటక నుంచి కందిపప్పు మాల్దీవులకు ఎగుమతి అవుతోందని వివరించారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం విజయదశమి రోజున ‘మన్‌ కీ బాత్‌’ ప్రారంభమైందని, అప్పటినుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ప్రయాణాన్ని ఒక తీర్థయాత్రగా మోదీ అభివర్ణించారు. సమాజం కోసం దేశం కోసం జీవించే వ్యక్తులు స్వయంగా తీర్థాలతో సమానమని పేర్కొన్నారు. సామాన్య ప్రజల నిబద్ధత, కఠోర శ్రమ, అంకితభావం, సేవా దృక్పథాలను దగ్గరగా చూసేందుకు ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని చెప్పారు.

Updated Date - Oct 26 , 2026 | 06:58 AM