Share News

ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:26 PM

ప్రధాని మోదీ ఇవాళ ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఘనంగా 'పశ్చిమబంగ దివస్' వేడుకలు.. సీఎం సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ
PM Modi Attends Paschimbanga Divas Celebrations, Releases PM-Kisan 23rd Installment in West Bengal

తారకేశ్వర్ (పశ్చిమ బెంగాల్), జూన్ 20: పశ్చిమ బెంగాల్ తారకేశ్వర్‌లో ఘనంగా నిర్వహించిన 'పశ్చిమబంగ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి ప్రధాని ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సమగ్ర వికాసం కోసం తమ ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.


ఈ చరిత్రాత్మక 'పశ్చిమబంగ దివస్' రాష్ట్రంలో సరికొత్త అభివృద్ధి విప్లవానికి స్ఫూర్తిగా నిలుస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని ప్రధాని అన్నారు. బెంగాల్ అభివృద్ధి చెందితేనే దేశం మరింత ముందుకు దూసుకెళ్తుందని మోదీ పేర్కొన్నారు. కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా, పశ్చిమ బెంగాల్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ పలు రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించారు.. శంకుస్థాపనలు చేశారు.


ప్రయాణికుల సౌకర్యార్థం, సరుకు రవాణా వేగాన్ని పెంచేందుకు కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణ పనులకు, బెంగాల్‌ తీరప్రాంత, గ్రామీణ ప్రజల జీవనోపాధిని పెంచేలా నూతన మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామాలకు రోడ్డు వసతులు, సాగునీటి ప్రాజెక్టులను బలోపేతం చేసే పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Updated Date - Jun 20 , 2026 | 09:35 PM