డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 100 వారాలు!
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:54 AM
వరుసగా వంద వారాలపాటు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది...
ఆగస్టు 2న ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ, జూలై 29: వరుసగా వంద వారాలపాటు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 2న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం క్రీడా కార్యక్రమాలను, కళా ప్రదర్శన పోటీలను నిర్వహిస్తామని, యువతతో ధ్యాన సాధన చేయిస్తామని వివరించారు. డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించాలనే చైతన్యం వచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, దీన్ని దేశవ్యాప్తంగా పదివేల ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్