Share News

పవన్‌ ఖేరా ఇంట్లో పోలీసుల సోదాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:00 AM

అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రింకి భుయాన్‌ శర్మ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా.. ఢిల్లీలోని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఇంట్లో అస్సాం పోలీసులు...

పవన్‌ ఖేరా ఇంట్లో పోలీసుల సోదాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రింకి భుయాన్‌ శర్మ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా.. ఢిల్లీలోని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఇంట్లో అస్సాం పోలీసులు మంగళవారం సోదాలు జరిపారు. రింకి భుయాన్‌కు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయని ఇటీవల పవన్‌ ఖేరా ఆరోపించారు. సదరు అక్రమాస్తుల వివరాలను హిమంత బిస్వశర్మ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని, కాబట్టి, ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలు అబద్ధమని పవన్‌ఖేరా మీద రింకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్సాం రాజధాని గౌహతిలోని క్రైంబ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 11 మంది పోలీసులతో కూడిన ఒక బృందం ఢిల్లీలోని పవన్‌ ఖేరా ఇంటికి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఇంట్లో సోదాలు జరిపింది. అనంతరం, అస్సాం పోలీస్‌ డీసీపీ దేబజిత్‌ నాథ్‌ అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఖేరా ఇంట్లో లేరని.. దీంతో సోదాలు జరిపి కొన్ని ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిలో కేసు తాలూకు కొన్ని సాక్ష్యాధారాలున్నాయని, అయితే, ఇప్పుడే వివరాలు వెల్లడించలేమన్నారు.ఖేరా ఎక్కడున్నారో తెలుసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:00 AM