ఎస్సీ జాబితాలో కులాన్ని చేర్చడం తొలగించడం పార్లమెంటు పని: మద్రాసు హైకోర్టు
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:47 AM
షెడ్యూల్డు కులాల జాబితాలో ఏదేని కులాన్ని చేర్చడం, జాబితా నుంచి తొలగించడం పార్లమెంటు పని అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
చెన్నై, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డు కులాల జాబితాలో ఏదేని కులాన్ని చేర్చడం, జాబితా నుంచి తొలగించడం పార్లమెంటు పని అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వన్నార్ సముదాయాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ‘తమిళనాడు వవన్నార్ సమన్వయ కమిటీ’ అధ్యక్షుడు ప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్ జి.అరుళ్ మురుగన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి కేంద్రానికి పంపాలని సూచించింది. దీనిపై పిటిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో తమ పిటిషన్‌ను ఉపసంహరించకునేందుకు అనుమతించాలని పిటిషనర్ చేసుకున్న అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది.