ఆధార్‌తో పాన్ దరఖాస్తు మార్చి 31 వరకే.. ఆ గడువు దాటితే..
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:27 PM
సాధారణంగా ఎవరైనా కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం రూల్స్ మారబోతున్నాయి.
సాధారణంగా ఎవరైనా కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతో పాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. కేవలం ఆధార్‌తోనే పాన్ పొందాలనుకుంటే మాత్రం మార్చి 31వ తేదీయే తుది గడువు అని కేంద్రానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది (PAN card new rules 2026).
బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు అత్యంత కీలకమనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నూతన పాన్ కార్డు కోసం ఆధార్ కార్డు కాపీ ఇస్తే సరిపోయేది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి వాటిల్లో ఏదో ఒకటి జత చేయాల్సి ఉంటుంది (Aadhaar PAN application deadline).
ఏప్రిల్ ఒకటి తర్వాత పాత పాన్ దరఖాస్తు ఫారాలను కూడా అనుమతించేది ఉండదని కామన్ సర్వీస్ సెంటర్ పేర్కొంది (PAN rules tightening ). ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తు ఫారాలు కూడా మారతాయని, కొత్తవి అందుబాటులోకి వస్తాయని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. అలాగే ఆన్‌లైన్‌లో కొత్త పాన్ కార్డు దరఖాస్తు కోసం utiitsl pan, Protean వెబ్‌సైట్లను సందర్శించాలని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..