Share News

పాక్‌లో జైషే మొహమ్మద్‌ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:57 AM

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మార్కజ్‌ సుభాన్‌ అల్లా్‌హ’ను పాకిస్థాన్‌ పునర్నిర్మించింది. దీంతో అక్కడ...

పాక్‌లో జైషే మొహమ్మద్‌ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ

  • భారత్‌ దాడి ఆనవాళ్లు కనిపించకుండా కొత్త కట్టడాలు

  • 25 కోట్లు ఇచ్చిన పాక్‌ సర్కారు!

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మార్కజ్‌ సుభాన్‌ అల్లా్‌హ’ను పాకిస్థాన్‌ పునర్నిర్మించింది. దీంతో అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే కాంప్లెక్స్‌ పునర్నిర్మాణానికి పాక్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎ్‌సఐ) ప్రమేయంతో అక్కడి ప్రభుత్వం విడతల వారీగా 25 కోట్ల పాకిస్థానీ రూపాయలను విడుదల చేసిందని సమాచారం. ఇందులో మార్కజ్‌ సుభాన్‌ అల్లా్‌హలోని సెంట్రల్‌ హాల్‌ పునరుద్ధరణకే రూ.11 కోట్లు (పాక్‌ కరెన్సీలో) ఖర్చు చేసినట్లు తెలిసింది. భారత్‌ దాడి ఆనవాళ్లు కనిపించకుండా దెబ్బతిన్న గుమ్మటాలు, అల్‌ సాబిర్‌ సెమినరీ, ఉగ్రవాద కమాండర్ల నివాస ప్రాంతాలను పూర్తిగా తొలగించి కొత్త భవనాలను నిర్మించారు. సెంట్రల్‌ హాల్‌లోని గుంతలను కాంక్రీట్‌తో పూడ్చి మార్బుల్‌ ఫ్లోరింగ్‌ వేయడంతో పాటు గోడలకు ప్లాస్టరింగ్‌, పెయింటింగ్‌ వేసి ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.

Updated Date - Aug 24 , 2026 | 06:57 AM