Share News

పాకిస్థాన్‌ అల్పబుద్ధి!

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:37 AM

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌ మరోసారి అల్పబుద్ధి చూపించింది. ఎస్‌సీవో నేతల గ్రూపు ఫోటోలో ప్రధాని మోదీ కనిపించకుండా కట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో...

పాకిస్థాన్‌ అల్పబుద్ధి!

ఎస్‌సీవో గ్రూపు ఫొటోలో మోదీని కట్‌ చేసి.. షేర్‌ చేసిన ఆ దేశ పీఎంవో

ఫుల్‌ ఫొటో షేర్‌ చేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌ మరోసారి అల్పబుద్ధి చూపించింది. ఎస్‌సీవో నేతల గ్రూపు ఫోటోలో ప్రధాని మోదీ కనిపించకుండా కట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన దుర్బుద్ధిని చాటుకుంది. ఆ ఫొటోలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీ్‌ఫను ప్రధానంగా, మధ్యలో ఉండేలా ఫొటోను క్రాప్‌ చేశారు. గ్రూపు ఫొటోలో తమ నేత ప్రముఖంగా కనిపించేందుకు పాక్‌ ఈ విధంగా చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అంతటితో అగకుండా ఎస్‌సీవో నేతల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని చూపిస్తోన్న ఓ వీడియోలో ప్రధాని మోదీ కనిపించే భాగాన్ని పాక్‌ ఎడిట్‌ చేసి, తొలగించింది. దీన్ని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో కూడా పోస్టు చేశారు. అయితే ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా 10 సభ్య దేశాలకు చెందిన నేతలందరూ ఉన్న గ్రూప్‌ ఫొటోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేయడం గమనార్హం. అందులో పాక్‌ ప్రధాని షరీఫ్‌ కూడా కనిపిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 06:37 AM