అఫ్గాన్‌లోని బాగ్రామ్ ఎయిర్‌బే్‌సపై పాక్ దాడి
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:10 AM
అఫ్గానిస్థాన్‌లోని వ్యూహాత్మక బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులు నిర్వహించింది. అఫ్గాన్ నేల నుంచి తమ దేశంపై జరుగుతున్న...
ఇస్లామాబాద్, మార్చి 4: అఫ్గానిస్థాన్‌లోని వ్యూహాత్మక బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులు నిర్వహించింది. అఫ్గాన్ నేల నుంచి తమ దేశంపై జరుగుతున్న ఉగ్ర దాడులను అరికట్టడంలో తాలిబన్లు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ‘ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్’ పేరుతో పాక్ ఈ భారీ సైనిక చర్యకు దిగింది. సుమారు 2600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి 53 ప్రాంతాల్లో అఫ్గాన్ తాలిబన్లు దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. వారికి తగిన బుద్ధి చెప్పేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పీటీవీ వెల్లడించింది. ఈ దాడిలో బాగ్రామ్ ఎయిర్‌బే్‌సలోని ఒక ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్, రెండు గిడ్డంగులు ధ్వంసమైనట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..