Share News

పాక్‌ నుంచి అక్రమ రవాణా.. 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాల సీజ్

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:55 PM

పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి దిగుమతి అయిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాసిక్‌లో సీజ్ చేశారు.

పాక్‌ నుంచి అక్రమ రవాణా.. 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాల సీజ్
Pakistan Dried Dates Seized

ఇంటర్నెట్ డెస్క్: పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి దిగుమతి అయిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాసిక్‌లో సీజ్ చేశారు. ముంబైకి చెందిన ఓ సంస్థ వీటిని దిగుమతి చేసుకుంది. అక్రమ రవాణా గురించి సమాచారం అందుకున్న అధికారులు ఈ ఎండుఖర్జూరాలను సీజ్ చేశారు.

ఎండు ఖర్జూరాలు తమ దేశంలో ఉత్పత్తి అయిన విషయాన్ని దాచిపెట్టేందుకు కొందరు పాక్ జాతీయులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. యూఏఈకి చెందిన ఖర్జూరాలుగా డాక్యుమెంట్స్ సృష్టించి భారత్‌కు పంపినట్టు గుర్తించారు. మొదట పాక్ నుంచి యూఏఈలోని జబేల్ అలీ పోర్టుకు తరలించి అక్కడి నుంచి మరో నౌకలో భారత్‌కు తరలించినట్టు డీఆర్ఐ అధికారులు తేల్చారు.


పహల్గాం దాడి తరువాత పాక్ నుంచి దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమమార్గాల్లో పాక్ సరకును భారత్‌కు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు డీఆర్ఐ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్‌ పేరిట ప్రత్యేక కార్యచరణను కొనసాగిస్తోంది. పాక్ నుంచి ఇతర దేశాల మీదుగా వచ్చే దిగుమతులను ఎప్పటికప్పుడు గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది.


ఈ వార్తలనూ చదవండి:

'సెమికాన్ ఇండియా'.. హాజరుకానున్న 600కు పైగా గ్లోబల్ దిగ్గజాలు

నేడు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్

Updated Date - Sep 14 , 2026 | 04:05 PM