Share News

పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు

ABN , Publish Date - Jul 15 , 2026 | 07:03 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. పాక్ ప్రభుత్వ ఆణచివేత చర్యలను నిరసిస్తూ పీఓకేలోని జాయింట్ యాక్షన్ కమిటీ భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది.

పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు
Pok Protests

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. పాక్ ప్రభుత్వ ఆణచివేత చర్యలను నిరసిస్తూ పీఓకేలోని జాయింట్ యాక్షన్ కమిటీ భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం 4 వేల మంది భద్రతా సిబ్బందిని వివిధ నగరాలు, టౌన్‌లల్లో మోహరించింది. మీడియా సిబ్బందిపై కూడా నిషేధించింది. రవాల్ కోట్ నుంచి ముజఫరాబాద్ వరకూ 40 వేల మందితో భారీ నిరసన ర్యాలీకి జేఏఏసీ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, ప్రభుత్వం ఈ ర్యాలీని అడ్డుకునేందుకు భారీ స్థాయిలో రేంజర్లు, పోలీసు బలగాలను మోహరించింది.


గత కొన్ని నెలలుగా పీఓకే నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. పీఓకే చట్టసభలో స్థానికుల ప్రాతినిధ్యానికి గండిపడేలా ప్రభుత్వం పాక్ వాసులను ఎమ్మెల్యే సీట్లకు నామినేట్ చేయడంతో మొదలైన నిరసనలు అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అరెస్టులు, ఇంటర్నెట్‌షట్‌డౌన్‌లు, భద్రతా దళాల మోహరింపులతో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితంగా లేకపోగా పరిస్థితి మరింత దిగజారుతోంది. మంగళవారం జరిగిన నిరసనల్లో ఏకంగా 12 మంది మరణించారు. ఈ ఘటనలపై స్పందించిన భారత్ పాక్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. దశాబ్దాల తరబడి అణచివేతకు ఈ నిరసనలు ప్రతిబింబమని వ్యాఖ్యానించింది.


ఈ వార్తలనూ చదవండి:

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

Updated Date - Jul 15 , 2026 | 08:08 PM