ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాలి!
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:40 AM
న్నికలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.
రిగ్గింగ్ జరుగుతోందని చెబుతూ..
వాటిల్లో ఎందుకు పాల్గొంటున్నారు?
మీ రాజకీయ ఉనికి కంటే ప్రజాస్వామ్య
పరిరక్షణకు పెద్ద పీట వేయండి
ప్రతిపక్షాలకు సీజేపీ నేత దీప్కే పిలుపు
సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలి
లేదంటే.. అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త
ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరిక
విపక్షాలకు సీజేపీ నేత దీప్కే పిలుపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. ఓవైపు ఎన్నికల్లో రిగ్గింగు జరుగుతోందని ఆరోపిస్తూ.. మరోవైపు వాటిల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు పాల్గొనటం వల్ల.. రిగ్గింగు జరుగుతున్న ఎన్నికలు కూడా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్న భ్రమను ప్రజల్లో కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు దీప్కే శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగటం లేదని భావిస్తున్నప్పటికీ.. వాటిలో పాల్గొనకపోతే రాజకీయంగా తమకు ఉనికి ఉండదన్న భయం ప్రతిపక్ష పార్టీలను వెంటాడుతున్నట్లుందని దీప్కే అభిప్రాయపడ్డారు. ‘ఓవైపు ఓట్లను దొంగిలిస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బులు వెదజల్లి కొనుగోలు చేస్తున్నారు. మీ పార్టీలను నిట్టనిలువునా చీలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ రాజకీయ ఉనికిని కాపాడుకోగలరా? ఎంతకాలం ఉనికిలో ఉండగలరు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల రిగ్గింగు సమస్య తమ తమ సొంత రాష్ట్రాల్లో ఎదురైనప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుతాం.. వేరే రాష్ట్రాల్లో జరిగినప్పుడు పట్టించుకోం అనే ధోరణిని వీడాలని ప్రతిపక్షాలకు దీప్కే సూచించారు. ఏ రాష్ట్రంలో జరిగినా, దానివల్ల ఏ పార్టీ బలైనా అందరూ దాని మీద స్పందించాలన్నారు.
తమ తమ రాజకీయ ప్రయోజనాల కంటే దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. ‘మీ రాజకీయ మనుగడ గురించి ఆలోచించేకంటే ముందు దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించండి. దేశం కోసం నిలబడండి. రిగ్గింగు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొనటం మానేయండి’ అని పేర్కొన్నారు. ఎన్నికల అవకతవకలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను దీప్కే పునరుద్ఘాటించారు. శనివారం నాటికి ఆయన రాజీనామా చేయకపోతే అక్టోబరు 2వ తేదీన ముంబై నుంచి దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని, అన్ని నగరాలకు విస్తరింపజేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ
సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌పై సీఎం విజయ్ ఫైర్