Share News

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:49 AM

లోక్‌సభ 12 గంటలకు ప్రారంభం అయిన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన చేసే అవకాశం ఉంది. విపక్షాలు సభను స్తంభింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 12 గంటలకు లోక్‌సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి
Lok Sabha opposition protest

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్ర హోంశాఖ మంత్రి మరికాసేపట్లో అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం అవగానే.. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌‌సభ 12 గంటలకు వాయిదా పడింది. సభ 12 గంటలకు ప్రారంభం అయిన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన చేసే అవకాశం ఉంది.


విపక్షాలు సభను స్తంభింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 12 గంటలకు లోక్‌సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సభ సజావుగా సాగకపోతే గందరగోళం మధ్యే అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి బిల్లుపై చర్చకు కూడా ఆయన అనుమతించారు. అమరావతి బిల్లును ఎలాగైనా ఈ రోజే లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని టీడీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు.


ఇవి కూడా చదవండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం: మంత్రి రవికుమార్

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

Updated Date - Apr 01 , 2026 | 12:01 PM