Share News

హోర్ముజ్‌లో ఆపరేషన్‌ ఉర్జా సురక్ష

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:14 AM

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఆంక్షలు విధించటంతో.. ఆ మార్గం నుంచి వచ్చే భారత వాణిజ్య నౌకలను...

హోర్ముజ్‌లో ఆపరేషన్‌ ఉర్జా సురక్ష

  • భారత వాణిజ్య నౌకలకు రక్షణగా ఐదారు యుద్ధ నౌకలు

న్యూఢిల్లీ, మార్చి 25: అమెరికా-ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఆంక్షలు విధించటంతో.. ఆ మార్గం నుంచి వచ్చే భారత వాణిజ్య నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు మనదేశ నౌకాదళం చడీచప్పుడు లేకుండా రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ ఉర్జా సురక్ష పేరుతో దాదాపు ఐదారు యుద్ధ నౌకలను హోర్ముజ్‌ జలసంధిలో నేవీ మోహరించిందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. ఈ యుద్ధ నౌకలు ఇటీవల పైన్‌ గ్యాస్‌, జగ్‌ వసంత్‌ అనే ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలను సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటించాయి. 92 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్న ఆ నౌకలు నేడో రేపో భారత తీరానికి చేరుకుంటాయి. ఇప్పటికే భారత్‌కు చేరిన ఎల్పీజీ ట్యాంకర్లు శివాలిక్‌, నందాదేవి, చమురు ట్యాంకర్‌ జగ్‌ లాడ్కిలను కూడా మన యుద్ధ నౌకలే సురక్షితంగా హోర్ముజ్‌ దాటించినట్లు నౌకాదళం వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌కు ప్రభుత్వం ఎక్కడా ప్రచారం కల్పించలేదు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:14 AM