Share News

ఈ-20 వద్దంటే ప్యూర్‌ పెట్రోల్‌ కొనుక్కోండి

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:58 AM

పెట్రోల్‌లో ఇథనాల్‌ బ్లెండింగ్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ మరోమారు సమర్థించారు. ఈ-20 పెట్రోల్‌ వద్దనుకునేవారు...

ఈ-20 వద్దంటే ప్యూర్‌ పెట్రోల్‌ కొనుక్కోండి

  • కానీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది: గడ్కరీ

న్యూఢిల్లీ, జూలై 15: పెట్రోల్‌లో ఇథనాల్‌ బ్లెండింగ్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ మరోమారు సమర్థించారు. ఈ-20 పెట్రోల్‌ వద్దనుకునేవారు ప్యూర్‌ పెట్రోల్‌ కొనుక్కోవచ్చని అన్నారు. దానికి ఇథనాల్‌ పెట్రోల్‌ కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇథనాల్‌ బ్లెండింగ్‌తో ఇంజిన్‌ పార్టులు దెబ్బతింటాయన్న ప్రచారం శుద్ధ తప్పు అని అన్నారు. బంకుల్లో ప్యూర్‌ పెట్రోల్‌ సదుపాయం ఉంటుందా అన్న ప్రశ్నకు గడ్కరీ సరైన సమాధానం ఇవ్వలేదు. అది తన పరిధిలో అంశం కాదని, ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని చెప్పారు.

Updated Date - Jul 16 , 2026 | 05:58 AM