Share News

వాహన బీమాపై ఎస్‌ఎంఎస్‌లు అవగాహన కోసమే

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:18 AM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు వాహన బీమా(ఇన్సూరెన్స్‌) రెన్యువల్‌ చేసుకోవాలంటూ అందుతున్న ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టత ఇచ్చింది.

వాహన బీమాపై ఎస్‌ఎంఎస్‌లు అవగాహన కోసమే
nhai

  • టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి చలాన్లు, జరిమానాలు ఉండవు: ఎన్‌హెచ్‌ఏఐ

న్యూఢిల్లీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు వాహన బీమా(ఇన్సూరెన్స్‌) రెన్యువల్‌ చేసుకోవాలంటూ అందుతున్న ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టత ఇచ్చింది. వాహనదారులను అప్రమత్తం చేసేందుకే ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు ఈ సందేశాలు పంపుతున్నామని వెల్లడించింది. టోల్‌ ప్లాజాల వద్ద జరిగే తనిఖీలకు ఈ ఎస్‌ఎంఎస్‌ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Updated Date - Nov 20 , 2026 | 06:54 AM