కోచింగ్ సెంటర్ యజమాని ఫోన్లో కెమిస్ట్రీ ప్రశ్నలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:55 AM
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది.
నీట్ పేపర్ లీక్ కేసు అనుబంధ చార్జిషీట్‌లో సీబీఐ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 23: నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో అరెస్టయిన మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ‘ఆర్‌సీసీ క్లాసెస్’ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ మోటేగాంకర్ ఫోన్ నుంచి రికవరీ చేసినప్రశ్నలు, మాస్టర్ సెట్‌లోని మొత్తం 45 కెమిస్ట్రీ ప్రశ్నలతో సరిగ్గా సరిపోలాయని పేర్కొంది. పరీక్షకు ముందే వాట్సాప్, టెలిగ్రామ్, ఎయిర్‌డ్రాప్ ద్వారా మెటీరియల్ పంపిణీకి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. గత చార్జిషీటులో 13మంది నిందితులను పేర్కొనగా.. అనుబంధ చార్జిషీటులో మరో వ్యక్తి పేరు చేర్చి ఫోరెన్సిక్ నివేదికలను జతచేసింది.