Share News

లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన ‘నయారా’

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:34 AM

దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఇంధన రిటైలర్‌ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 గురువారం...

లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన ‘నయారా’

న్యూఢిల్లీ, మార్చి 26: దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఇంధన రిటైలర్‌ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 గురువారం పెంచింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి రాగా, ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఆధారంగా ఈ పెంపు వర్తించనుంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.5.30 వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా 1,02,075 పెట్రోల్‌ పంపులు ఉండగా.. రష్యా సంస్థ రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పంపులను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 06:34 AM