వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:17 PM
ఉత్తర భారత గగనతలంలో దట్టమైన పొగకమ్ముకున్న వైనాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాటిలైట్లు తాజాగా గుర్తించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారత గగనతలంలో దట్టమైన పొగకమ్ముకున్న వైనాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాటిలైట్లు తాజాగా గుర్తించాయి. ఉత్తరాదిన వాయుకాలుష్య తీవ్రతకు అద్దం పట్టేలా ఉన్న ఈ దృశ్యాల్లో దట్టమైన పొగ అటు ఉత్తర భారతం మీదుగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల వరకూ విస్తరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో పొగ మరింత దట్టంగా కనిపించింది. ఉత్తరాదిన వ్యవసాయ క్ష్రేత్రాల్లో పంటవ్యర్థాలను తగలపెట్టిన ఆనవాళ్లను సైతం శాటిలైట్లు గుర్తించాయి.
ఏటా శీతాకాలంలో పాక్‌తో పాటు ఉత్తర భారతంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. పంటవ్యర్థాల దహనంతో పాటు వాహనకాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం వంటి వాటి కారణంగా గాల్లో దుమ్ముధూళి, పొగ దట్టంగా కమ్ముకుంటుంది. దీనికి తోడు శీతలవాతావరణం, గాలి ప్రవాహం తగ్గడంతో కాలుష్యకారకాలు ఉత్తరాదిన పేరుకుని పలు అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యం దారుణంగా పెరిగిపోయింది. ముఖ్యం రాత్రిళ్లు, తెల్లవారుజామున ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గంగా సింధు నదీ ప్రరీవాహక ప్రాంతంలో వాయు కాలుష్యం విపరీతంగా నాసా శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది.
ఈ వార్తలనూ చదవండి:
లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఆరోపణ.. ఆధారాలు చూపాలన్న సూర్య
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!