Share News

ఐదోసారి పగ్గాలు చేపట్టనున్న రంగస్వామి..!

ABN , Publish Date - May 06 , 2026 | 06:19 AM

పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించిన రంగస్వామి ఐదోసారి పుదుచ్చేరి సీఎం పీఠం ఎక్కడానికి రంగం సిద్ధమయింది....

ఐదోసారి పగ్గాలు చేపట్టనున్న రంగస్వామి..!

గత క్యాబినెట్‌లానే పుదుచ్చేరిలో ఈసారీ సంకీర్ణమే

పుదుచ్చేరి, మే 5: పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించిన రంగస్వామి ఐదోసారి పుదుచ్చేరి సీఎం పీఠం ఎక్కడానికి రంగం సిద్ధమయింది. ఆయన పార్టీ ఏఐఎన్‌ఆర్‌సీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అసెంబ్లీలో నిలిచింది. మొత్తం 16 స్థానాల్లో పోటీ చేయగా 12 చోట్ల విజయం సాధించింది. 30 సీట్లున్న అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 16 మంది బలం ఉండాలి. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకోగా, ఏఐఏడీఎంకే, ఎల్‌జేకే ఇతర ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొంటే మొత్తం బలం 18కి చేరుకుంటుంది. వీరికితోడు ముగ్గురు నామినేటెడ్‌ సభ్యులు ఉండనే ఉన్నారు. పాండీ కొత్త అసెంబ్లీకి నేతగా రంగస్వామి ఎంపిక నామమాత్రమే. గత క్యాబినెట్‌ మాదిరే ఈసారి కూడా సంకీర్ణ మంత్రి వర్గం ఏర్పడనుంది. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఆరుకు మించదు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 6 సీట్లు గెలుచుకుంది. డీఎంకేకు ఐదు రాగా, కాంగ్రె్‌సకు ఒకే ఒక్క స్థానం దక్కింది.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:19 AM