Share News

స్కూల్ బస్ ఘటన.. బాలుడి సమాధిలో క్రికెట్ బ్యాటు, బాల్

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:37 PM

ముంబై నగరంలోని చెంబూర్ రోడ్ నంబర్ 11లో మంగళవారం మధ్యాహ్నం స్కూల్ బస్సుపై చెట్టు కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం విహాన్ అంత్యక్రియలు జరిగాయి.

స్కూల్ బస్ ఘటన.. బాలుడి సమాధిలో క్రికెట్ బ్యాటు, బాల్
Mumbai Tree Collapse

ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై నగరంలోని చెంబూర్ రోడ్ నంబర్ 11లో మంగళవారం మధ్యాహ్నం స్కూల్ బస్సుపై చెట్టు కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విహాన్ అనే 11 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. విహాన్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారికి విహాన్ ఒక్కడే సంతానం కావటంతో విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.


బాలుడి అకాల మరణంపై స్థానికులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం విహాన్ అంత్యక్రియలు జరిగాయి. విహాన్‌తో పాటు అతడు ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌కు సంబంధించిన బాల్, బ్యాట్‌ను కూడా ఖననం చేశారు. కాగా, విహాన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి రాగానే క్రికెట్ ఆడ్డానికి వెళ్లేవాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలన్నది అతడి కోరిక.


ఇదే విషయాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ మహిళకు తరచుగా చెబుతుండేవాడు. విహాన్ మరణవార్త తెలియగానే తల్లి జూహీ పూర్తి స్థాయిలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ ఒడిలో పెట్టుకుని మంచంపై కూర్చుండిపోయారు. కొన్ని గంటల పాటు అలా శూన్యంలోకి చూస్తుండిపోయారు. ఆమె తరచుగా ‘విహాన్ క్రికెట్ ఆడుకోవటానికి వెళ్లాలి’ అనటం అక్కడున్న వాళ్లను కన్నీళ్లు పెట్టించింది.


ఇవి కూడా చదవండి

ఏపీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులు.. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు.. రూ.70 లక్షలు సీజ్

Updated Date - Jul 01 , 2026 | 08:48 PM