డోర్ మూయడంపై గొడవ.. రైల్లో యువకుడి హత్య
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:27 AM
ముంబై సబర్బన్ రైల్లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. కదిలే రైల్లో డోర్ మూసే విషయంలో..
ముంబై, జూన్ 24: ముంబై సబర్బన్ రైల్లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. కదిలే రైల్లో డోర్ మూసే విషయంలో మయాంక్ లోహర్ (21) అనే యువకుడికి, రోషన్ అనే వ్యక్తికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో రోషన్‌పై తోటి ప్రయాణికులు చేయి చేసుకున్నారు. దీంతో విచక్షణ కోల్పోయిన రోషన్ తన బ్యాగులోంచి కత్తి తీసి మయాంక్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో మయాంక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హత్య ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడు రక్తసిక్తమైన కత్తిని పట్టుకొని వీడియోలో ఉండటం కనిపించింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో నిందితుడు రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!