టెక్నాలజీపై గుత్తాధిపత్యం ప్రమాదకరం
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:15 AM
ఆధునిక సాంకేతికతలను, వాటికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌ను ఏదో ఒక్కదేశం లేదా కొన్ని దేశాలు నియంత్రణలో పెట్టుకోవటం ప్రపంచానికి మంచిది కాదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.
టెక్నాలజీపై
గుత్తాధిపత్యం ప్రమాదకరం
మనలోని భిన్నత్వమే మన గుర్తింపు.. మన మధ్య ఉన్న సహకారమే మనకు ప్రేరణ. మన ప్రగతి మొత్తం మానవాళికి ఉపయోగకరం. బ్రిక్స్ కూటమి అధ్యక్ష హోదాలో భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు అంశాలు మూలస్తంభాలుగా ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తోంది. బ్రిక్స్ ద్వారా జరిగే ఈ వృద్ధి మొత్తం గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం కలిగిస్తుంది.
బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
సాంకేతికతను, క్రిటికల్ మినరల్స్‌ను
ఆయుధాలుగా వాడటం ప్రపంచానికే ముప్పు
బ్రిక్స్ సదస్సు ముగింపు కార్యక్రమంలో మోదీ
క్రిటికల్ మినరల్స్ సరఫరాపై చైనా నియంత్రణ
ఆ దేశాధ్యక్షుడి సమక్షంలోనే ప్రధాని వ్యాఖ్యలు
గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్ కూటమే బలమని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఆధునిక సాంకేతికతలను, వాటికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌ను ఏదో ఒక్కదేశం లేదా కొన్ని దేశాలు నియంత్రణలో పెట్టుకోవటం ప్రపంచానికి మంచిది కాదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇతర దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు వీటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవటం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌ను చైనా నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు షీజిన్‌పింగ్ సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. భూగోళమంతా ఒకే కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత ఆధునిక కాలంలో భూమిపై ఏ మూల ఏ చిన్న దుర్ఘటన జరిగినా అది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి బ్రిక్స్ కూటమి దేశాల మధ్య మరింత సహకారం, సమన్వయం అవసరమని పేర్కొన్నారు. .
రెండురోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘మన నేపథ్యాలు భిన్నమైనవి కావచ్చు.. కానీ, పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించి మానవత్వాన్ని వికసింపజేస్తున్నాం. మనలోనిభిన్నత్వమే మన గుర్తింపు.. మన మధ్య ఉన్న సహకారమే మనకు ప్రేరణ. మన ప్రగతి మొత్తం మానవాళికి ఉపయోగకరం. బ్రిక్స్ కూటమి అధ్యక్ష హోదాలో భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు అంశాలు మూలస్తంభాలుగా ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తోంది. బ్రిక్స్ ద్వారా జరిగే ఈ వృద్ధి మొత్తం దక్షిణార్థగోళానికి ప్రయోజనం కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అనేకచోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు పెరుగుతున్నాయిఇవి సామాన్య ప్రజలపై దీర్ఘకాలంపాటు దుష్ప్రభావం చూపిస్తున్నాయి. మహమ్మారి వ్యాధులు, ప్రకృతి విపత్తులు, సప్లైచైన్‌లో అడ్డంకులు ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఈ విపత్తులను ముందుగానే గుర్తించటం, వాటిపై పోరాటం చేయటంలో అన్ని దేశాలకు సమాన ప్రాధాన్యం ఉండాలి. ఇందుకోసం ప్రతిపాదించిన బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరికల వ్యవస్థకు భారత్ మద్దతు తెలుపుతోంది. బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లైచైన్ కోఆపరేషన్ నెట్‌వర్క్ కూటమి దేశాల మధ్య సప్లైచైన్ మరింత సమర్థంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. బ్రిక్స్ ఇంక్యుబేషన్ నెట్క్‌వర్క్ సభ్యదేశాల స్టార్ట్‌పలను అనుసంధానించటంలో కీలకంగా మారుతుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదిస్తున్నాం. బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా సభ్య దేశాల మధ్య మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శ్రామిక శక్తిలో మహిళల వాటాను పెంచటం సాధ్యమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.
జిన్‌పింగ్ ఇబ్బంది.. ప్రసంగం ఆపిన మోదీ
మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇబ్బంది పడటంతో మోదీ తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. ప్రసంగం ప్రారంభమైన 4నిమిషాల తర్వాత జిన్‌పింగ్ ఇబ్బందిగా కదలటం మోదీ గమనించి ‘అంతా ఓకేనా?’ అని ట్రాన్స్‌లేటర్‌ను అడిగారు. అటు నుంచి వెంటనే సమాధానం రాకపోవటంతో కొద్ది క్షణాల తర్వాత మళ్లీ అదే ప్రశ్న అడిగారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోదీ ప్రసంగం ట్రాన్స్‌లేషన్‌లో సాంకేతిక ఇబ్బంది వల్లనే జిన్‌పింగ్ ఇబ్బంది పడినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓమన్ తీరంలో భారత నౌకపై దాడి.. 13 మంది భారతీయులు సురక్షితం
అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీఅంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: