చర్చకు మరో రూపమే నిరసన
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:33 AM
ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్‌ఎ్‌సఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలేగానీ విభేదాలకు...
ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే
సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనలకు దిగుతారు
అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే
ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు
జెన్ జీ, జెన్ ఆల్ఫాతో భేటీలో ఆరెస్సెస్ చీఫ్ భాగవత్
ముంబై, ఆగస్టు 6: ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్‌ఎ్‌సఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలేగానీ విభేదాలకు దారి తీయవద్దన్నారు. గురువారం ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్’ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో దాదాపు రెండు వేల మంది జెన్ జీ (1997-2012 మధ్యకాలంలో జన్మించినవారు), జెన్ ఆల్ఫాను (2013 తర్వాత జన్మించిన వారు) ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రజల ఆందోళనలను పట్టించుకోకపోతే వారు నిరసనలకు దిగుతారని.. జెన్‌జీ సమస్యలు నిజమైనవని, వారి నిజాయితీ పట్ల తనకు విశ్వాసం ఉందని భాగవత్ తెలిపారు. ఎవరైనా తొలుత చర్చకు ప్రాధాన్యమివ్వాలని, చర్చతో ఫలితం లేనప్పుడు ఇతర మార్గాల గురించి తర్వాత ఆలోచించాలన్నారు. ఇంతకుముందటి తరాలు పెద్దవాళ్లు చెబితే మరో మాట లేకుండా పాటించేవారని, ప్రస్తుత తరం తమ ప్రశ్నలకు సహేతుక సమాధానాలు కోరుకుంటున్నారని, అది కూడా తమను గౌరవిస్తూ చెప్పాలని అనుకుంటున్నారని తెలిపారు.
శాశ్వత శత్రుత్వం, విద్వేషం సరికాదు
పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఘర్షణలు లేనప్పుడు చర్చల ప్రక్రియను కొనసాగించాలని, శాశ్వత శత్రుత్వం, విద్వేషం సమస్యను పరిష్కరించవని భాగవత్ తెలిపారు. స్వలింగసంపర్కుల అంశంపై స్పందిస్తూ.. వారు కూడా సమాజంలో భాగమేనన్నారు. స్వలింగ జంటలకు అవసరమైన సామాజిక, న్యాయపరమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడున్న (స్త్రీ పురుష) వివాహ వ్యవస్థను నష్టపరిస్తే దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టటానికి దానిని నిషేధించాల్సిన అవసరం లేదని, స్వీయ క్రమశిక్షణతో ఆ పని చేయవచ్చన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతగా మెలగాలని, తమను ఫాలో అయ్యేవారిని తప్పుదారి పట్టించవద్దన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6ు నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ను తాను సమర్థిస్తానన్నారు. సమాజంలో ఉన్న కులవివక్షను, అసమానతలను తొలగించటానికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని, అసమానతలు ఉన్నంతకాలం వాటిని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ ఫలాలు అందుకొని పైకి ఎదిగిన కుటుంబాలు, ఇతరులకు అవకాశం లభించేలా తాము రిజర్వేషన్‌ను వదులుకునే యోచన చేయాలని సూ చించారు. నాయకత్వం అంటే.. ఉపన్యాసాలు ఇవ్వటం, ఎన్నికల్లో విజయాలు సాధించటం మాత్రమే కాదన్నారు. నాయకుడికి తగినంత జ్ఞానం ఉండాలని, ఇతరులలో ఉండే మంచిని ప్రశంసించే ఔదార్యం ఉండాలని, తనకు లభించిన విజయాన్ని, ప్రతిష్ఠను, సంపదను ఇతరులతో పంచుకోవాలని, సంక్లిష్ట సమయాల్లో యో ధుడిలా సవాళ్లను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు