Share News

మోదీ-ట్రంప్‌.. మధ్యలో మస్క్‌!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:14 AM

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఫోన్‌ చేసిన సమయంలో వీరి సంభాషణ మధ్యలోకి ఎలాన్‌ మస్క్‌ కూడా ప్రవేశించినట్లు వచ్చిన వార్తలు...

మోదీ-ట్రంప్‌.. మధ్యలో మస్క్‌!

  • గత మంగళవారం మోదీకి డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌కాల్‌

  • వీరి సంభాషణ మధ్యలో ఎలాన్‌ మస్క్‌ రంగప్రవేశం!

  • అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

న్యూఢిల్లీ, మార్చి28: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఫోన్‌ చేసిన సమయంలో వీరి సంభాషణ మధ్యలోకి ఎలాన్‌ మస్క్‌ కూడా ప్రవేశించినట్లు వచ్చిన వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం గురించి చర్చించేందుకు గత మంగళవారం మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేశారు. యుద్ధ ప్రభావంపై ఇద్దరు నేతలు మాట్లాడుకుంటున్న సమయంలో మస్క్‌ కూడా వీరి సంభాషణలో జోక్యం చేసుకున్నట్లు పేర్లు వెల్లడించని ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథనం ప్రచురించింది. రెండు దేశాల ప్రభుత్వాధినేతల అధికారిక సంభాషణలోకి ఓ ప్రైవేటు వ్యక్తి ప్రవేశించటం అసాధారణ విషయం. దీంతో ఈ అంశం రెండు దేశాల్లోనూ సంచలనంగా మారింది. దీనిపై అటు అమెరికా ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం శనివారం వ్యూహాత్మకంగా స్పందించాయి. చర్చలో మస్క్‌ ప్రమేయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్‌ను పీటీఐ వార్తా సంస్థ వివరణ కోరగా.. ట్రంప్‌-మోదీ మధ్య ఫలవంతమైన చర్చ జరిగిందని చెప్పారు తప్పతే.. ఈ చర్చలో మస్క్‌ పాల్గొన్నారా? లేదా అనేది మాత్రం చెప్పలేదు. భారత విదేశాంగశాఖ కూడా ఈ అంశంపై స్పందించింది. ఈ నెల 24న మోదీ-ట్రంప్‌ మధ్య మాత్రమేఫోన్‌కాల్‌ సంభాషణ సాగిందని శనివారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 06:14 AM