Share News

మణిపూర్‌లో ఓ ఇంటిపై బాంబు దాడి

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:13 AM

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సోమవారం బిష్ణుపూర్‌ జిల్లా మొయిరాంగ్‌ ప్రాంతంలోని ఓ ఇంటిపై దుండగులు బాంబు దాడికి...

మణిపూర్‌లో ఓ ఇంటిపై బాంబు దాడి

  • ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి మృతి

ఇంఫాల్‌, ఏప్రిల్‌ 7: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సోమవారం బిష్ణుపూర్‌ జిల్లా మొయిరాంగ్‌ ప్రాంతంలోని ఓ ఇంటిపై దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి చనిపోయారు. వారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. కుకీ గ్రూపులకు చెందిన తీవ్రవాదులు ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రెండు చమురు ట్యాంకర్లకు నిప్పు పెట్టారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపుపైనా దాడి చేశారు. వారిని చెదరగొట్టడానికి భద్రతా బలగాలు కాల్పులు జరపగా ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది. నిరసనల నేపథ్యంలో మణిపూర్‌లోని ఐదు జిల్లాలో మూడు రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:13 AM