Share News

మహారాష్ట్రలో వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:00 PM

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి
Maharashtra flood tragedy

ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం యవాత్మాల్ జిల్లాకు చెందిన అవినాష్ ఖందారే ఫ్యామిలీ కారులో అహిల్యానగర్‌లోని ‘లోని’ ప్రాంతానికి బయలుదేరింది. భారీ వర్షాల కారణంగా ధార్మా ఏరియాలో కుప్తీ నది పోటెత్తడంతో.. వరద నీరు అక్కడి ఓ బ్రిడ్జిపైకి వచ్చేసింది. కారు నడుపుతున్న అవినాష్ ఆ వరద నీటిని తక్కువ అంచనా వేశాడు. కారును బ్రిడ్జి మీదకు పోనిచ్చాడు.


కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో అవినాష్‌తో పాటు అతడి భార్య మాధవి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరూ నీటిలో కొట్టుకుపోయారు. అవినాష్ కారు నుంచి బయటపడి ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ మొదలెట్టాయి. రెస్క్యూ సిబ్బంది శుక్రవారం యవాత్మాల్ జిల్లాలో తల్లీకూతుళ్ల మృతదేహాలను గుర్తించారు.


ఇవి కూడా చదవండి

రాష్ట్రానికి డీఏపీ ఎరువుల సరఫరా పెంచండి: కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ఐబీ ఆఫీసర్ హత్య.. ఆప్ మాజీ నేతకు యావజ్జీవం

Updated Date - Jul 31 , 2026 | 07:11 PM