Share News

సొంత పార్టీ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన దీదీ

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:58 PM

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా ఒక వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించారు. పార్టీ నిరసన కార్యక్రమంలో పోటెత్తిన జనాన్ని అదుపు చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది.

సొంత పార్టీ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన దీదీ
Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన నిరసన ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పోటెత్తిన జనాల్ని అదుపు చేసే క్రమంలో మాజీ సీఎం ఒక వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించారు. ఆ వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త అని తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బరూయీపూర్‌లో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.


బరూయీపూర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన 11 ఏళ్ల బాలిక హత్యాచారం ఉదంతానికి నిరసనగా మమత ఆధ్వర్యంలో తృణమూల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయితే, తృణమూల్ ర్యాలీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగడంతో పలుచోట్ల ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.

బీజేపీ, తృణమూల్ కార్యకర్తల పరస్పర వ్యతిరేక నినాదాలు, తోపులాటల మధ్యే ర్యాలీ సాగింది. కొన్ని చోట్ల జనాల్ని అదుపు చేసేందుకు పోలీసులు బ్యాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. బీజేపీ కార్యకర్తలు మానవ హారాన్ని ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దొంగ, దొంగ.. అంటూ టీఎంసీ వ్యతిరేక నినాదాలు చేశారు. గతంలో క్రిమినల్స్‌కు రక్షణ కల్పించిన పార్టీకి ర్యాలీ నిర్వహించే నైతిక హక్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక ర్యాలీ మమతా బెనర్జీ ఇంటి ముందుకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున జన సమూహం అక్కడకు చేరింది. జనాల్ని అదుపు చేసేందుకు మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక వ్యక్తిపై ఆమె చేయి చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆ వ్యక్తి తృణమూల్ పార్టీ కార్యకర్తేనని ఆ తరువాత తేలింది.


ఈ వార్తలనూ చదవండి:

ఈ20 పెట్రోల్ విధానంపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

Updated Date - Jul 08 , 2026 | 10:07 PM